ధూళిపాళ్లపై అసభ్య వీడియోలు

ప్రధానాంశాలు

Published : 22/10/2021 08:23 IST

ధూళిపాళ్లపై అసభ్య వీడియోలు

సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమార్తె

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తన తండ్రి సహా కుటుంబీకులపై అసభ్యపదజాలంతో, వివిధ ఆరోపణలతో యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేస్తున్న పంచ్‌ ప్రభాకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో నుంచి వాటిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలో మద్యం ఏరులై పారుతోందని, ఆ ప్రాంతం మత్తు పదార్థాలకు అడ్డాగా మారిందని చెబుతూ... తమ తండ్రిని అసభ్యపదజాలంతో సంబంధిత వీడియోల్లో ప్రభాకర్‌ దూషించారన్నారు. ఆయన కుమార్తెలు సైతం మత్తుకు బానిసయ్యారంటూ వీడియోలు పోస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. గతంలో తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పైనా ప్రభాకర్‌ ఇదే తరహాలో యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్‌ చేశారు. దానిపైనా కేసు నమోదు చేశామని ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన