Published : 09/05/2021 07:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కర్ఫ్యూ వేళ రోడ్లపై వాకింగ్‌ : కేసులు


నిషేదాజ్ఞలు ఉల్లంఘించబోమని ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎస్పీ అమ్మిరెడ్డి

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : కర్ఫ్యూ వేళల్లో రోడ్లపై నడక (వాకింగ్‌), పరుగు (జాగింగ్‌) చేస్తున్న వారిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో కర్ఫ్యూ అమలవుతున్న తీరును శనివారం సాయంత్రం అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి కాలినడకను పర్యటిస్తూ తనిఖీ చేశారు. అరండల్‌పేట, కొరిటెపాడు, విద్యానగర్‌, రింగ్‌రోడ్డు తదితర ప్రధాన కూడళ్లలో రహదారులపై ప్రజలు రాకపోకలు సాగిస్తున్న తీరును పరిశీలించారు. ఈ క్రమంలో రోడ్లపై జనం వాకింగ్‌, జాగింగ్‌ కోసం రావడం చూసి నివ్వెరపోయారు. వారిని ఆపి రోడ్లపైకి ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే మందుల దుకాణాలకు వెళుతున్నామని, బంధువుల ఆరోగ్యం బాగోలేకపోతే వారి ఇంటికి వెళుతున్నామంటూ అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటిస్తే ఏమాత్రం బాధ్యత లేకుండా రోడ్లపై తిరగడం సరికాదన్నారు. అకారణంగా తిరుగుతున్న పాదచారులు వందమందిని అరెస్టు చేసి వారిపై కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు. వారితో ‘మేము..ప్రభుత్వ కర్ఫ్యూ ఉత్తర్వులను తప్పకుండా పాటిస్తాం. రేపటి నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరుసటిరోజు 6 గంటల వరకు అత్యవసరాలు లేనప్పుడు రోడ్ల మీదకు రామని’ ఎస్పీ ప్రమాణం చేయించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని