త్వరలో 3 రాజధానులు ఖాయం: సజ్జల
logo
Published : 12/06/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలో 3 రాజధానులు ఖాయం: సజ్జల

అమరావతి: త్వరలో రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగడం, 3 రాజధానులు ఏర్పడటం ఖాయమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటుకు సహాయం చేయాలని సీఎం జగన్‌ కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్‌ సమస్యల పరిష్కారం సహా పలు అభివృద్ధి అంశాలపై చర్చించారన్నారు. విభజన చట్టంలోని సమస్యల పరిష్కారంపై కేంద్ర మంత్రులతో సీఎం జగన్‌ ప్రత్యేకంగా చర్చించినట్టు తెలిపారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, ఇళ్ల నిర్మాణం, ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై సీఎం జగన్‌ చర్చించారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు నీరుగార్చారని, తాము ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్టు తెలిపారు. కేసుల మాఫీ కోసమే జగన్‌ దిల్లీ వెళ్లారంటూ తెదేపా నేతలు చేస్తోన్న ఆరోపణలను ఖండించారు. సీఎం జగన్‌ పర్యటన వ్యక్తిగతం కాదని, రాష్ట్ర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దిల్లీ పర్యటన సాగిందన్నారు. శాసనమండలి రద్దు చేయాలని ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, శాసనమండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్నారు. శాసనమండలిని రద్దు చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని