భవనంపై నుంచి పడి వైద్య విద్యార్థిని దుర్మరణం
logo
Published : 14/06/2021 04:14 IST

భవనంపై నుంచి పడి వైద్య విద్యార్థిని దుర్మరణం

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి నగరం ఆత్మకూరులో ఉంటున్న వైద్య విద్యార్థిని కనుమూరి లక్ష్మీసూర్య అమూల్య(19) బహుళ అంతస్తుల భవనంపై నుంచి పడి మృతి చెందింది. కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌కు చెందిన అమూల్య తల్లదండ్రులతోపాటు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం సమీపంలో 16వ జాతీయ రహదారి పక్కన ఆత్మకూరు పరిధిలో గల మిడ్‌వ్యాలీ సిటీలో బహుళ అంతస్తుల భవనం కైలాస్‌ బ్లాక్‌లో 1506 ఫ్లాట్‌లో ఉంటున్నారు. విద్యార్థిని ప్రమాదవశాత్తు 15వ అంతస్తు నుంచి పడిపోయి మృతి చెందినట్టు మంగళగిరి గ్రామీణ పోలీసులు తెలిపారు. తండ్రి భాస్కరరాజు, పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం అమూల్య విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో రెండో సంవత్సరం ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. భాస్కరరాజు దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కూతురికి వివాహమైంది. అమూల్య చిన్న కుమార్తె. తను నివాసం ఉంటున్న ఫ్లాట్‌ బాల్కనీలో పిట్టగోడపై కూర్చొని చదువుకుంటున్న అమూల్య శనివారం అర్థరాత్రి తర్వాత ప్రమాదవశాత్తు కిందకి పడిపోవటంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని శవ పరీక్ష కోసం మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశామని ఎస్‌.ఐ. శ్రీనివాసరెడ్డి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని