డాక్టర్‌ నాగకిషోర్‌కు ‘ఇండియన్‌ ఎచీవర్‌’ అవార్డు
logo
Published : 16/06/2021 02:59 IST

డాక్టర్‌ నాగకిషోర్‌కు ‘ఇండియన్‌ ఎచీవర్‌’ అవార్డు


నాగకిషోర్‌ను సత్కరించి, అవార్డుపత్రం అందిస్తున్న వీసీ ఆచార్య రాజశేఖర్‌. పక్కన ఇతర అధ్యాపకులు

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల సహాయాచార్యులు భవనం నాగకిషోర్‌రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. ఈయన అమెరికా, దక్షిణాఫ్రికా, కెనడాల్లోని వర్సిటీల్లో కోర్సులు పూర్తిచేసినందుకుగాను ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ నుంచి ‘ఇండియన్‌ ఎచీవర్‌’ ఆవార్డు వచ్చింది. పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి 3 గౌరవ డిగ్రీలు, 100 ఆన్‌లైన్‌ కోర్సులు పూర్తిచేసినందుకు ఈ అవార్డు లభించింది. ఈ ఘనత సాధించిన నాగకిషోర్‌ను వీసీ ఆచార్య రాజశేఖర్‌ మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాగకిషోర్‌ మాట్లాడుతూ ఈ కోర్సులు పూర్తిచేసేందుకు 25 రోజుల సమయం పట్టిందని, ఆయా రోజుల్లో కేవలం 4 గంటలపాటు మాత్రమే నిద్రపోయానని చెప్పారు. లాక్‌డౌన్‌ సమయాన్ని వృథా చేయకుండా పలు అంశాలపై పట్టు సాధించాలనే ఉద్దేశంతోనే ఈ కోర్సుల్ని ఎంచుకున్నానన్నారు. చెన్నైలో ఓ అధ్యాపకుడు 1000 సర్టిఫికెట్‌ కోర్సులు చేశారని, ఆయనను అధిగమించడమే తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య వరప్రసాదమూర్తి, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని