పీవీ సింధు అకాడమీకి భూమి కేటాయింపు
logo
Published : 17/06/2021 18:52 IST

పీవీ సింధు అకాడమీకి భూమి కేటాయింపు

ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

విశాఖ: ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు బ్యాడ్మింటన్‌ అకాడమీ, స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. విశాఖ రూర‌ల్ మండలంలోని చినగ‌దిలి వద్ద సర్వే నంబరు 72, 83 పరిధిలో రెండెక‌రాల భూమిని కేటాయించింది. ఈ మేరకు పీవీ సింధుకు కేటాయించిన భూమిని పశుసంవర్థక, యువజన సర్వీసులు, క్రీడా శాఖకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ భూమిని ఉచితంగానే కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

కేవలం అకాడ‌మీ అవ‌స‌రాల‌ కోస‌మే ఈ భూమిని వినియోగించాల‌ని, ఎలాంటి వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించరాదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అకాడ‌మీ ద్వారా ప్రతిభ ఉన్న పేద‌వారికి లాభాపేక్ష లేకుండా శిక్షణ ఇవ్వాల‌ని ప్రభుత్వం స్పష్టం చేసింది. అకాడమీని రెండు దశల్లో నిర్మించనున్నట్లు పీవీ సింధు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఒక్కో దశలో రూ.5 కోట్లు కేటాయించి నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని