AP News: ధాన్యం కొంటున్నా విమ‌ర్శిస్తున్నారు: కొడాలి నాని
logo
Updated : 19/06/2021 14:06 IST

AP News: ధాన్యం కొంటున్నా విమ‌ర్శిస్తున్నారు: కొడాలి నాని

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని రైతుల‌కు ర‌బీ సీజ‌నులో రూ.1,637 కోట్ల‌ చెల్లింపులు చేశామ‌ని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి బ‌కాయిల‌ను 21 రోజుల‌ గ‌డువులోగా చెల్లిస్తామ‌ని చెప్పిన‌ట్లు వివరించారు. రూ.3,229 కోట్ల అడ్వాన్సు బ‌కాయిలు చెల్లించాల్సిందిగా కేంద్ర ప్ర‌భుత్వాన్నికూడా కోరిన‌ట్లు చెప్పారు. ర‌బీ సీజ‌నులో 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులే సేక‌రించే అవ‌కాశం ఉంద‌ని నాని అన్నారు. 

ఇప్ప‌టికే ఆరు మెట్రిక్ ట‌న్నుల ధాన్యం రైతులు బ‌య‌ట విక్ర‌యించుకున్నార‌ని తెలిపారు. ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంటే తెదేపా నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని కొడాలి నాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల‌ను దాచి పెడుతున్నార‌న్నారు. ఏపీలో అన్నింటినీ పార‌ద‌ర్శ‌కంగా వెల్ల‌డిస్తున్నామ‌ని చెప్పారు. ఈ విష‌యంపై సీఎం త‌మ‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చార‌ని మంత్రి తెలిపారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని