రికార్డు స్థాయిలో టీకా పంపిణీ
logo
Published : 22/06/2021 04:13 IST

రికార్డు స్థాయిలో టీకా పంపిణీ

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో ఆదివారం నిర్వహించిన మెగా టీకా డ్రైవ్‌ విజయవంతం అయిందని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం.సుహాసిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా 1,44,179మందికి టీకాను పంపిణీ చేసి, రికార్డు సృష్టించామని ఆనందం వ్యక్తం చేశారు.

కేంద్రం మార్పు: ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కొవిడ్‌ విధులకు సంబంధించి వివిధ పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన ద]రఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమానికి మంచి స్పందన లభించిందన్నారు. మంగళవారం నుంచి ద]రఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గల డీఎంహెచ్‌ఓ క్యాంపు కార్యాలయానికి మార్పు చేశామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని