రైతులకు అందుబాటులో ఎరువులు
eenadu telugu news
Published : 01/08/2021 02:43 IST

రైతులకు అందుబాటులో ఎరువులు

వాహనాలను ప్రారంభిస్తున్న జేసీ దినేష్‌కుమార్‌

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: ఖరీఫ్‌ ప్రారంభమైనందున రైతులకు అవసరమైన ఎరువులను ఉంచేలా చర్యలు తీసుకున్నామని సంయుక్త కలెక్టరు దినేష్‌కుమార్‌ తెలిపారు. ఇఫ్కో నానో ఎరువులను డీసీఎంఎస్‌కి కేటాయించింది. సరకును డీసీఎంఎస్‌ శాఖలకు శనివారం తరలించారు. కలెక్టరేట్‌లో జేసీ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. 500 మి.లీ. బాటిల్‌ ధర రూ.240గా నిర్ణయించారని, రైతులకు ఆ ధరకే సరఫరా చేయాలని జేసీ సూచించారు. సమావేశంలో డీసీఎంఎస్‌ ఛైర్‌పర్సన్‌ వై.భాగ్యలక్ష్మి, జేడీఏ విజయభారతి, డీసీవో రాజశేఖర్‌, ఏడీఏ రవికుమార్‌, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ వెంకట్‌రావు, డీసీఎంఎస్‌ బిజినెస్‌ మేనేజర్‌ హరిగోపాల్‌, కార్యాలయ మేనేజర్‌ శ్రీనివాసులు, ఇఫ్కో జిల్లా మేనేజరు రఘు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని