వేతన బకాయిలు చెల్లించాలంటూ వైద్యుల సమ్మె
eenadu telugu news
Published : 16/09/2021 03:01 IST

వేతన బకాయిలు చెల్లించాలంటూ వైద్యుల సమ్మె


సమ్మెలో పాల్గొన్న జీజీహెచ్‌ జనరల్‌ డ్యూటీ వైద్యులు

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: ఐదు నెలల వేతన బకాయిలను వెంటనే విడుదలు చేయాలని, తమకు ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని జనరల్‌ డ్యూటీ వైద్యులు సమ్మె బాట పట్టారు. బుధవారం తెల్లవారుజాము నుంచి వారంతా విధులకు గైర్హాజరయ్యారు. జిల్లాలో సుమారు 250 మందికి పైగా జనరల్‌ డ్యూటీ వైద్యులున్నారు. తమకు న్యాయం చేసే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. కాగా వారి స్థానంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు హౌస్‌ సర్జన్‌లను, ఇతర సిబ్బందిని నియమించి రోగులకు సమస్యలు ఎదురుకాకుండా చర్యలు తీసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోస్టర్‌ను మార్చారు. హౌస్‌ సర్జన్‌లు జనరల్‌ డ్యూటీ వైద్యుల స్థానంలో విధులకు హాజరు కావాలని ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని