పన్నులు చెల్లించని వాహనాలపై కేసులు
eenadu telugu news
Published : 18/09/2021 04:16 IST

పన్నులు చెల్లించని వాహనాలపై కేసులు


కేసులు నమోదు చేస్తున్న రవాణా శాఖ అధికారులు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: త్రైమాసిక పన్నులు చెల్లించకుండా రాకపోకలు సాగిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు గుంటూరు ఉపరవాణా శాఖ కమిషనర్‌ మీరాప్రసాద్‌ వెల్లడించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. మీరాప్రసాద్‌ మాట్లాడుతూ అయిదో నెంబర్‌ జాతీయ రహదారి, పేరేచర్ల జంక్షన్‌, ప్రత్తిపాడు రోడ్డులో తనిఖీలు నిర్వహించి 46 కేసులు నమోదు చేసి రూ.5,80,000 జరిమానా విధించామన్నారు. పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేసేందుకు ప్రత్యేక తనిఖీ బందాలను నియమించామన్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ వాహనాలకు 200 శాతం జరిమానా విధిస్తామన్నారు. పాఠశాలల బస్సులకు సంబంధించి సామర్థ్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే విద్యార్థులను ఎక్కించుకోవాలన్నారు. తనిఖీల్లో ఎంవీఐలు రవికుమార్‌, రాములు, విజయసారథి, నాగలక్ష్మి, ప్రసన్నకుమారి, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని