Suicide: ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టి .. ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
eenadu telugu news
Updated : 28/09/2021 14:33 IST

Suicide: ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టి .. ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: భార్య, అత్త, ఆమె కుమార్తెలు పెడుతున్న వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరుకు చెందిన శంకర్‌నారాయణ కుమారుడు ఉదయ్‌భాస్కర్‌(45) కొంతకాలం క్రితం మదనపల్లెకు వచ్చి ఇక్కడే శేష్‌మహాల్‌ ఏరియాలోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆరేళ్ల క్రితం మదనపల్లెకు చెందిన సోనీతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. ఉదయ్‌భాస్కర్‌ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ విషయమై తరచూ గొడవలు పడేవారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి సోనీ పుట్టింటికి వెళ్లింది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఉదయ్‌భాస్కర్‌ తన భార్య, ఆమె తల్లి, భార్య చెల్లెల్లు పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక ఫేస్‌బుక్‌లో లైవ్‌పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని గుర్తించిన కొంతమంది స్నేహితులు బాధితుడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. వారందరూ అక్కడికి చేరుకునే సరికే ఆయన మృతిచెందాడు. మద్యానికి బానిసై ఉదయ్‌భాస్కర్‌ తరచూ వేధింపులకు గురి చేసేవాడని, ఈ నేపథ్యంలో పలుమార్లు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, ఆదివారం కూడా గొడవపెట్టుకొని కొట్టడంతో తాను పుట్టింటికి వెళ్లినట్లు మృతుడి భార్య సోనీ తెలిపారు. ఒకటో పట్టణ సీఐ ఇదురుబాషా, ఎస్సై లోకేశ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని