45,301 మందికి జగనన్న తోడు
eenadu telugu news
Published : 21/10/2021 03:42 IST

45,301 మందికి జగనన్న తోడు

జగనన్న తోడు చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న హోంమంత్రి సుచరిత,

ఎంపీలు అయోధ్యరామిరెడ్డి, వెంకటరమణారావు, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తదితరులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో జగనన్న తోడు పథకం ద్వారా 45,301 మందికి రూ.1,66,18,780 కోట్లను వడ్డీ కింద జమ చేసినట్లు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద జగనన్న తోడు పథకం ప్రారంభ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టరేట్‌ నుంచి తిలకించారు. 2019-20 సంవత్సరంలో ఫేజ్‌-1 కింద అర్బన్‌, రూరల్‌ పరిధిలో 51,413 మంది లబ్ధిదారులకు రూ.52.95 కోట్లు, 2020-21 సంవత్సరంలో ఫేజ్‌-2 కింద 28,463 మంది లబ్ధిదారులకు రూ.28.46 కోట్లు మొత్తం 79,876 మంది లబ్ధిదారులకు రూ.80.41 కోట్లు రుణం అందించినట్లు తెలిపారు. వారిలో 45,301 మందికి జగనన్న తోడు కింద వడ్డీ జమ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కల్పలత, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌రావు, ముస్తఫా, జేసీలు దినేష్‌కుమార్‌, జి.రాజకుమారి, కె.శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని