పోలీసు స్పందనకు 71 ఫిర్యాదులు
eenadu telugu news
Published : 26/10/2021 04:32 IST

పోలీసు స్పందనకు 71 ఫిర్యాదులు


ఫిర్యాదుదారుల సమస్యలు తెలుసుకుంటున్న తూర్పు డీసీపీ హర్షవర్ధన్‌రాజు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 71 ఫిర్యాదులు వచ్చాయి. తూర్పు డీసీపీ హర్షవర్ధన్‌రాజు ఆన్‌లైన్‌లో ఫిర్యాదుదారుల విజ్ఞప్తులు స్వీకరించారు. మొత్తం ఫిర్యాదుల్లో అత్యధికంగా నగదు లావాదేవీలకు సంబంధించి 19 ఫిర్యాదులు, కుటుంబ కలహాలు 19, సివిల్‌ 10, వివిధ మోసాలు 7, అద్దె వివాదాలు 5, త్వరితగతిన కేసుల దర్యాప్తుపై 2, ఇతర ఫిర్యాదులు 9 వచ్చాయి. వీటిని జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులతో నేరుగా మాట్లాడి, సత్వరం చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని