రైతులకు అందుబాటులో ఉండండి
eenadu telugu news
Published : 23/10/2021 06:20 IST

రైతులకు అందుబాటులో ఉండండి


సూచనలు చేస్తున్న జేడీఏ చంద్రానాయక్‌

రహమత్‌పూర్‌(హిందూపురంగ్రామీణం), న్యూస్‌టుడే: రైతు భరోసా కేంద్రాల్లో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని వ్యవసాయశాఖ అనంతపురం జేడీఏ చంద్రానాయక్‌ సూచించారు. స్థానిక ఏడీ కార్యాలయ ఆవరణలో హిందూపురం డివిజన్‌ పరిధిలోని గోరంట్ల, చిలమత్తూరు, పరిగి, లేపాక్షి, హిందూపురం గ్రామీణ మండలాల వ్యవసాయాధికారులు, విస్తరణాధికారులు, ఆర్బీకే సిబ్బందితో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించబోమని హెచ్చరించారు. ఏడీఎ రవి, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
మొక్కజొన్న పంట పరిశీలన
మణేసముద్రం(హిందూపురంగ్రామీణం): మండలంలోని మణేసముద్రం గ్రామంలో రైతులు సాగుచేసిన మొక్కజొన్న పంటను జేడీఏ చంద్రానాయక్‌ శుక్రవారం పరిశీలించారు. దిగుబడి ఘననీయంగా ఉన్నందున గిట్టుబాటు ధర కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఆదేశాలు అందిన వెంటనే కేంద్రాలను అందుబాటులో ఉంచుతామన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని