ఎర్రచందనంతో పాటు నాటుతుపాకీ స్వాధీనం
logo
Published : 06/05/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎర్రచందనంతో పాటు నాటుతుపాకీ స్వాధీనం


● ఏపీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు, నాటుతుపాకీ. 

జీవకోన (తిరుపతి),న్యూస్‌టుడే: ఏపీటాస్క్‌ ఫోర్స్‌ తిరుపతి విభాగం అధికారులు నిర్వహించిన దాడుల్లో ఎర్రచందనం దుంగలతో పాటు స్మగ్లర్‌ను అదుపులోనికి తీసుకుని, అతడి నుంచి నాటు తుపాకీ, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మురళీధర్‌ కథనం మేరకు.. అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణ టాటా ఆదేశాల మేరకు మంగళవారం చామల రేంజ్‌ పరిధిలోని నాగపట్ల అటవీప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు కూంబింగ్‌ నిర్వహించాయి. అటవీ ప్రాంతంలో కొంతమంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను మోసుకుంటూ వస్తూ టాస్క్‌ఫోర్స్‌ బృందం కంట పడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు స్మగ్లర్లను చుట్టుముట్టి పట్టుకునే ప్రయత్నం చేశారు. స్మగ్లర్లు ఎర్రదుంగలను వదిలిపెట్టి పారిపోయే ప్రయత్నం చేయగా.. ఐతేపల్లెకు చెందిన రంబే మునికృష్ణను పట్టుకున్నారు. అతని నుంచి నాటుతుపాకీ, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు వదిలిపెట్టిన 4 ఎర్రచందనం దుంగలను సీజ్‌ చేశారు. పట్టుబడిన స్మగ్లర్‌ గతంలో అనేక ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని అధికారి వివరించారు. మార్చి ఒకటో తేదీన అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠాతో కలిసి ఎర్రచందనం అక్రమరవాణా చేస్తూ పట్టుబడ్డాడని, ఇటీవలే బెయిల్‌పై వచ్చి మళ్లీ ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్నాడని వివరించారు. బుధవారం నిందితుడిని తిరుపతి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్‌ విధించారన్నారు. దాడుల్లో ఆర్‌ఎస్సైలు వాసు, సురేష్‌కుమార్‌, డీఆర్వో నరసింహరావు పాల్గొన్నారు.

పట్టుబడిన నిందితుడు రంబే మునికృష్ణ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని