అతివేగంగా నడిపితే చర్యలు:అర్బన్‌ ఎస్పీ
eenadu telugu news
Published : 16/09/2021 05:36 IST

అతివేగంగా నడిపితే చర్యలు:అర్బన్‌ ఎస్పీ


లారీ యజమానితో మాట్లాడుతున్న అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు

చంద్రగిరి గ్రామీణ: మదనపల్లె-తిరుపతి మార్గంలోని భాకరాపేట కనుమదారిలో వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రోడ్డును తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు బుధవారం పరిశీలించారు. అత్యంత ప్రమాదకర మలుపులను పరిశీలించిన ఆయన మంగళవారం బోల్తా పడిన టమోటా లారీ వాహన యజమానితో మాట్లాడారు. లారీ ఎందుకు బోల్తా పడింది? డ్రైవర్‌ మీతో ఏం మాట్లాడాడో నిజం చెబితే సమస్యను పరిష్కరించి.. మళ్లీ ప్రమాదాలు జరగకుండా చూస్తామన్నారు. డ్రైవర్‌కు ఈ మార్గం కొత్త కావడం, ప్రమాదకర మలుపు ఉన్నట్లు గుర్తించకపోవడంతో పాటు ఆర్టీసీ బస్సులు ఒక దాని వెంట మరొకటి అధిగమించినందున అదుపు తప్పిందని చెప్పినట్లు వివరించారు. ఇకపై ఆర్టీసీ బస్సులను అతి వేగంగా నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కనుమదారిలో తరచూ తనిఖీలు చేసి వాహనాలను ఎవరు అధిగమించినా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. తిరుపతి పశ్చిమ విభాగం డీఎస్పీ నరసప్ప తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని