అలిపిరిలో దళారుల గొడవ
eenadu telugu news
Published : 20/09/2021 04:46 IST

అలిపిరిలో దళారుల గొడవ

తిరుపతి (తితిదే), నేరవిభాగం, న్యూస్‌టుడే: అలిపిరి పాత తనిఖీ కేంద్రం వద్ద దళారులు గొడవపడి ఇద్దరు గాయపడిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు.. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు టోకెన్లు లేకపోవడంతో తితిదే విజిలెన్స్‌ సిబ్బంది అలిపిరిలో తనిఖీ చేసి తిరిగి పంపించేవారు. అక్కడ ఉండే దళారులు(జీపు డ్రైవర్లు) కొందరు ఓ బృందంగా ఏర్పడి భక్తులతో మాట్లాడి తిరుమలకు తీసుకెళ్తామని కొంత నగదు తీసుకుంటున్నారు. l అలిపిరి తనిఖీ కేంద్రంలోని కొందరు సిబ్బందికి.. దళారులకు ఉన్న సంబంధాల మేరకు వీరు సూచించే వాహనాలను అనుమతించేవారు. భక్తులను తిరుమలకు చేర్చిన తరువాత ఒప్పందం మేరకు నగదు వసూలు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం వాటాల పంపకం విషయంలో నెలకొన్న వివాదం గొడవగా మారింది. సుమారు 45 నిమిషాలపాటు కొందరు దళారులు దాడులు చేసుకున్నట్లు తెలిసింది. గొడవలో ఇద్దరు దళారులకు తీవ్రగాయాలు కావడంతో అక్కడి నుంచి తనిఖీ కేంద్రం ఏవీఎస్‌వోను కలిసి జరుగుతున్న విషయాన్ని వివరించారు. ఆయన సూచన మేరకు రుయా ఆసుపత్రికి వెళ్లారు.

 దీనిపై ఏవీఎస్‌వో శైలేంద్రబాబును వివరణ కోరగా బాధితులను ఆసుపత్రికి పంపించి సమాచారాన్ని అలిపిరి పోలీసులకు అందించినట్లు తెలిపారు. ఘటనపై అలిపిరి ఎస్‌ఐ జయచంద్ర కేసు దర్యాపు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని