పని ఒత్తిడి తగ్గించాలి
eenadu telugu news
Published : 20/09/2021 04:46 IST

పని ఒత్తిడి తగ్గించాలి

సమావేశంలో పాల్గొన్న వివిధ జిల్లాల బిల్‌ కలెక్టర్లు

విజయవాడ, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోని వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం అడ్మిన్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న బిల్‌ కలెక్టర్లపై మోపిన పని ఒత్తిడి తగ్గించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని 13 జిల్లాల స్థానిక సంస్థల్లోని సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఆయా జిల్లాల బిల్‌ కలెక్టర్లు, విజయవాడ గాంధీనగర్‌లోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం సమావేశమయ్యారు. జాబ్‌ ఛార్టుకు భిన్నంగా సచివాలయాల్లో ఉద్యోగులకు విధులు అప్పగించడం వల్ల తీవ్రమైన పనిఒత్తిడికి లోనై అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ జి.అజయ్‌కుమార్‌ పాల్గొని ప్రసంగించారు. సుమారు 200 మందికి పైగా పలు జిల్లాల బిల్‌ కలెక్టర్లు పాల్గొన్నారు.

బిల్‌ కలెక్టర్ల సంఘం ఎంపిక..

13 జిల్లాల నుంచి హాజరైన బిల్‌కలెక్టర్లు ఈ సందర్భంగా నూతన సంఘాన్ని ఎంపిక చేసుకున్నారు. నూతన సంఘానికి ఎ.శ్రీనివాసరావు(గుంటూరు) ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా సుబ్బారావు(కృష్ణా), మరోవైస్‌ ప్రెసిడెంట్‌గా విజయకుమారి(తూర్పు గోదావరి), సెక్రటరీగా గంగాధర్‌(పశ్చిమ గోదావరి), జాయింట్‌ సెక్రటరీగా సాయిరాఘవ(ప్రకాశం), ట్రెజరర్‌గా శ్రీనివాసరావు(రాజమండ్రి) ఎన్నికయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని