భక్తిశ్రద్ధలతో మిలాద్‌-ఉన్‌-నబీ
eenadu telugu news
Published : 20/10/2021 05:53 IST

భక్తిశ్రద్ధలతో మిలాద్‌-ఉన్‌-నబీ

వాల్మీకిపురం: మహమ్మద్‌ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్‌ ఉన్‌ నబీని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా ముస్లిం సోదరులు మంగళవారం భక్తిశ్రద్ధలతో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ధార్మిక చింతన, కరుణ, దాతృత్వం పెంపొందించడానికి అన్నదానాలు చేశారు. వాల్మీకిపురంలో మసీదు ముతవల్లీల ఆధ్వర్యంలో గంధోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.పెద్దమండ్యం మండలంలోని కలిచెర్లలో కడప దర్గా పీఠాధిపతి అరిఫుల్లా హుస్సేని మొక్కలు నాటారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని