క్షమాపణచెప్పాలి
eenadu telugu news
Published : 22/10/2021 05:17 IST

క్షమాపణచెప్పాలి

జనాగ్రహం ఆందోళనల్లో వైకాపా నాయకులు


పుత్తూరులో మాట్లాడుతున్న నగరి ఎమ్మెల్యే రోజా

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: ముఖ్యమంత్రి జగన్‌పై తెదేపా నేత పట్టాభిరామ్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ‘జనాగ్రహం’ పేరిట వైకాపా నేతలు గురువారం జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ఎమ్మెల్యేలు నేతృత్వం వహించారు. పుత్తూరులో ఆర్‌కే రోజా, నారాయణవనంలో ఆదిమూలం, వాల్మీకిపురంలో చింతల రామచంద్రారెడ్డి, ఆరణి శ్రీనివాసులు, పలమనేరులో వెంకటేగౌడ నిరసన దీక్షల్లో పాల్గొని తెదేపా అధినేత చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. పుత్తూరులో రోజా చంద్రబాబుతో పాటు లోకేశ్‌ నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేరును ప్రస్తావిస్తూ మాట్లాడారు. కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లోని మండలాల్లో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. పెద్దమండ్యం, కంభంవారిపల్లె, చంద్రగిరి, సోమల, బి.కొత్తకోట ర్యాలీలు, దీక్షలు నిర్వహించడంతో పాటు పోలీసులకు తెదేపా నేత పట్టాభిపై ఫిర్యాదులు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో శుక్రవారం దీక్షలు చేపట్టాలని నేతలు నిర్ణయించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని