దంపతుల ఆయువు తీసిన ఆర్థిక ఇబ్బందులు 
eenadu telugu news
Updated : 28/10/2021 06:33 IST

దంపతుల ఆయువు తీసిన ఆర్థిక ఇబ్బందులు 


పాపారావు పూసలమ్మ (పాత చిత్రాలు)

 

కాజులూరు, న్యూస్‌టుడే : ఆర్థిక ఇబ్బందులు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. కరోనా కారణంగా సరిగా పనులు లేకపోవడం.. ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులు భారంగా మారడం తదితర కారణాలతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కాజులూరు మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, గొల్లపాలెం పోలీసుల కథనం ప్రకారం.. కాజులూరుకు చెందిన రేఖాడి పాపారావు(56), రేఖాడి పూసలమ్మ(46) మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు. వీరికి పిల్లలు లేరు. ఒక అమ్మాయిని పెంచి పెద్దచేసి వివాహం చేశారు. వృద్ధాప్యం కారణంగా పాపారావు చేపల వేటకు వెళ్లే పరిస్థితి లేదు. స్థానికంగా చిన్నచిన్న కాలువల్లో చేపలు పట్టి, విక్రయించి జీవనం సాగించే వారు. తాతారావు దంపతులు ఇటీవల సొంత ఇళ్లు నిర్మించుకున్నారు. ఇందుకు కొంతమంది వద్ద అప్పులు చేశారు. కరోనా కారణంగా ఏడాదిగా పనులు లేకపోవడంతో పూట గడవడం కష్టంగా ఉండేది. దీనికి తోడు ఇంటి నిర్మాణానికి తెచ్చిన అప్పులకు వడ్డీ పెరిగిపోవడం.. వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో బుధవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాకినాడ గ్రామీణ సీఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్సై పవన్‌కుమార్‌, గ్రామ రెవెన్యూ అధికారి గోపాలరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని