నాలుగు క్రస్టుగేట్ల నుంచి నీటి విడుదల
eenadu telugu news
Published : 21/09/2021 01:37 IST

నాలుగు క్రస్టుగేట్ల నుంచి నీటి విడుదల

 విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ డ్యాం నాలుగు క్రస్టుగేట్ల ద్వారా ఐదడుగులు ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణాకు సోమవారం విడుదల చేశారు. సాగర్‌ కుడి కాలువకు 8529, ఎడమ కాలువకు 8718, ఎస్‌ఎల్‌బీసీకి 2400, సాగర్‌ ప్రధాన జలవిద్యుత్తు కేంద్రానికి 32,318, లోలెవల్‌ కాలువకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయం నుంచి మొత్తం 84,515 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 84,515 క్యూసెక్కుల నీరొచ్చి 
చేరుతోంది. సాగర్‌ జలాశయం నీటిమట్టం 590.00 అడుగులకు చేరి 
గరిష్ఠస్థాయికి చేరింది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని