‘భాజపాతోనే సుస్థిర పాలన’
eenadu telugu news
Published : 21/09/2021 01:37 IST

‘భాజపాతోనే సుస్థిర పాలన’

ఆళ్లవారిపాలెం (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే : దేశంలో సుస్థిర పాలన భాజపాతోనే సాధ్యమని ఆ పార్టీ బాపట్ల పార్లమెంట్ కార్యదర్శి రాంపల్లి జగన్నాథశాస్త్రి అన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ‘సేవా సమర్పణ అభియాన్‌’ కార్యక్రమాలను ఆయన ఇటీవల ప్రారంభించారు. గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకంలో భాగంగా పేదలకు ఉచిత బియ్యం సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు రెండు రోజుల కార్యక్రమాన్ని ఆయన సోమవారం మండలంలోని ఆళ్లవారిపాలెం, కనగాల, రాజోలులో నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని చౌక ధరల దుకాణాలను ఆయన మరో కార్యదర్శి సుగ్గున గణేష్, ఇతర నేతలతో కలసి సందర్శించారు. పేదలకు ప్రధాని మోదీ అందిస్తున్న మనిషికి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీని పరిశీలించారు. పలువురు వృద్ధులకు బియ్యం అందించారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పుషడపు కృష్ణప్రసాద్,  జిల్లా కిసాన్‌ మోర్చా నేత ఉండ్రకొండ వెంకటశివరావు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని