టెయిల్‌పాండ్‌లో రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి
eenadu telugu news
Published : 28/10/2021 02:39 IST

టెయిల్‌పాండ్‌లో రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి

సత్రశాల టెయిల్‌పాండ్‌ డ్యాంను తనిఖీ చేస్తున్న జెన్‌కో సీీఈ సుజయ్‌కుమార్‌

రెంటచింతల, న్యూస్‌టుడే : సత్రశాల టెయిల్‌పాండ్‌ డ్యాంలో రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేసినట్లు జెన్‌కో సీఈ సుజయ్‌కుమార్‌(హైడల్‌) తెలిపారు. ప్రాజెక్టు తనిఖీలో భాగంగా బుధవారం విజయవాడ నుంచి వచ్చి స్థానిక అధికారులతో చర్చించారు. అనంతరం సీఈ మాట్లాడుతూ 2016-17వ సంవత్సరంలో 9.34 మిలియన్‌ యూనిట్లు, 2017-18లో 44.81, 2018-19లో 50.56, 2019-20లో 78.2283, 2020-21లో 54.7177, 2021-22 మంగళవారం దాకా 100.3776 మిలియన్‌ యూనిట్లు విద్యుదుత్పత్తి చేసి రికార్డు సాధించడంతో ఇంజనీర్లను అభినందిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో అధికంగా విద్యుదుత్పత్తి చేసి నేడు సాధించిన రికార్డులు రెట్టింపు చేయాలని అధికారులను కోరారు. బుధవారం ఎగువనున్న నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి 44,119 క్యూసెక్కుల వరద నీరొచ్చి చేరుతోంది. డ్యాం 4 గేట్లు రెండు మీటర్లు ఎత్తు ఎత్తి 36,264 క్యూసెక్కులు, రెండు యూనిట్ల ద్వారా 1.0299 మిలియన్‌ యూనిట్లు విద్యుదుత్పత్తి చేసి టెయిల్‌ రెస్‌ ఛానల్‌ ద్వారా 7,855 క్యూసెక్కుల నీరు దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నట్లు వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని