రెండో పెళ్లికి సిద్ధమైన యువకునిపై కేసు
eenadu telugu news
Published : 28/10/2021 02:38 IST

రెండో పెళ్లికి సిద్ధమైన యువకునిపై కేసు

వినుకొండ, న్యూస్‌టుడే: వివాహమై బిడ్డ పుట్టిన తరువాత మోసగించి మరొక యువతితో నిశ్ఛాతార్థం చేసుకున్న యువకుని బండారం బయటపడింది... మొదటి భార్య సమాచారమివ్వడంతో మోసగించిన అతనిపై చర్యలు తీసుకోవాలని బాధిత యువతి తండ్రి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేటలోని జిడ్డుపాలెంకు చెందిన మహేష్‌నాయక్‌కు వినుకొండకు చెందిన యువతితో జులై 25న నిశ్చితార్థమైంది. ఆగస్టు 21న వివాహం చేయాలని నిశ్చయించారు. మలేషియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నట్లు చెప్పడంతో ముందుగా రూ.2.10 లక్షల నగదు, బంగారం కట్నం కింద ఇచ్చారు. ఒక యువతి ఫోన్‌ చేసి మహేష్‌నాయక్‌తో తనకు వివాహమై కుమారుడు పుట్టాడని చెప్పి ఫొటోలు పంపించింది. యువతి తల్లిదండ్రులు మొదటి పెళ్లి విషయాన్ని ఎందుకు చెప్పలేదని నిలదీయడంతో ఆమెకు విడాకులిచ్చి ఈ అమ్మాయిని చేసుకుంటానని బుకాయించాడు. అందుకు అంగీకరించకుండా తామిచ్చిన నగదు, బంగారం తిరిగి ఇవ్వాలని కోరగా స్పందించకపోవడంతో మహేష్‌నాయక్‌తో పాటు తల్లిదండ్రులు, అతని సోదరుడిపై ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని