Published : 25/01/2021 02:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రంజింపజేసిన ‘మోక్ష శ్రీ’ నృత్యవిన్యాసం


సభలో డీజీపీ మహేందర్‌రెడ్డి, తనికెళ్ల భరణి, హరికృష్ణ, గురువారెడ్డి, శేషుబాబు, జగన్‌ గురూజీ, మోక్షశ్రీ

నారాయణగూడ, న్యూస్‌టుడే: కాళ్లకు అందెలుకట్టి, తన్మయత్వంతో, అనురక్తితో, పాటకు, సంగీతానికి లయబద్దంగా అడుగులు వేస్తూ.. చక్కటి హావభావాలతో వర్ధమాన నర్తకి ‘బొల్లపల్లి మోక్ష శ్రీ’ ప్రదర్శించిన కూచిపూడి నృత్యాంశాలు ఆహుతులను రంజింపజేశాయి. ఆదివారం కింగ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో నృత్యాంకుర ఫౌండేషన్‌ (బెంగళూరు) డైరెక్టర్‌, నాట్యగురువు రేఖా సతీష్‌ శిష్యురాలు బొల్లపల్లి మోక్షశ్రీ ఆదివారం కింగ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో అరంగేట్రం చేశారు. ఈ సందర్భంగా అభినందన సభలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, నాట్యగురువు డా.రమాదేవి, డాక్టర్‌ గురువారెడ్డి, నాట్యగురువు డా.పసుమర్తి శేషుబాబు, యోగా గురువు జగన్‌ గురూజీలు నర్తకి మోక్షశ్రీని అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని