Published : 04/03/2021 03:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.74 లక్షల అక్రమ బంగారం పట్టివేత


పేస్టులా మార్చిన బంగారం

శంషాబాద్‌, న్యూస్‌టుడే: దుబాయ్‌ నుంచి ప్రయాణికురాలు రహస్యంగా తీసుకొస్తున్న అక్రమ బంగారాన్ని బుధవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయ అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. హకీంపేట్‌కు చెందిన అమ్‌తుల్‌ ఆర్షియా హశిల్‌ మహ్మద్‌ దుబాయ్‌ నుంచి స్వదేశానికి వస్తోంది. 1,593 గ్రాముల బంగారాన్ని కరిగించి పేస్టులా మార్చి లోదుస్తుల్లో పెట్టుకుని విమానం ఎక్కింది. విమానాశ్రయంలో దిగి బయటకు వస్తుండగా భద్రతాధికారులకు అనుమానం వచ్చి క్షుణ్నంగా తనిఖీలు చేయగా రూ.74 లక్షల విలువైన అక్రమ బంగారం తరలింపు గుట్టురట్టయింది.

40 వేల విదేశీ సిగరెట్లు.. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ అజీజ్‌ అబుదాబి నుంచి స్వదేశానికి వస్తున్నాడు. అతని సామగ్రిలో విదేశాలకు చెందిన 40 వేల సిగరెట్లను రహస్యంగా తరలిస్తున్నాడు. విమానాశ్రయ భద్రతాధికారులకు అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా భారీగా విదేశీ సిగరెట్లు బయటపడ్డాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని