Published : 12/04/2021 02:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కార్పొరేట్‌ వైద్యం సామాన్యులకు చేరువ కావాలి

ఆసుపత్రిని ప్రారంభిస్తున్న మంత్రి ఈటల, పక్కన డా.కందస్వామి, డా.ధనభాగ్యం

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: సామాన్య ప్రజలకు సైతం అందుబాటు ధరల్లో అధునిక వైద్యం అందేలా కార్పొరేట్‌ ఆస్పత్రులు కృషి చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. ఆదివారం బంజారాహిల్స్‌లో సుధా హాస్పిటల్స్‌.. ఫెర్టిలిటీ అండ్‌ ఉమెన్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభమైంది. మంత్రి ఈటల ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ఆస్పత్రిని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సైతం ఐవీఎఫ్‌ కేంద్రాలను ప్రారంభించే ఆలోచనలో ఉందని తెలిపారు. సుధా హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ డా.డి.కందస్వామి, ఆస్పత్రి అధ్యక్షురాలు డా.ఎస్‌.ధనభాగ్యం ఎండీ డా.కె.సుధాకర్‌, ఉపాధ్యక్షురాలు డా.ఎస్‌.ప్రదీప, కార్పొరేటర్‌ మన్నె కవితారెడ్డి, తెరాస ఖైరతాబాద్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని