మా బామ్మను బతికించండి ప్లీజ్‌!
logo
Published : 12/05/2021 06:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా బామ్మను బతికించండి ప్లీజ్‌!


బామ్మను ఆటోలో తీసుకొస్తున్న యువ వైద్యురాలు

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఆసుపత్రి గుమ్మం తొక్కేవారిలో తీవ్ర ఆందోళన.. తమవారిని బతికించుకుందామనే ఆత్రుత.. పడకల కోసం వైద్యులు, వైద్య సిబ్బందిని ప్రాధేయపడుతున్న దృశ్యాలు.. చూసేవారి కళ్లలో సుడులు తిరిగేలా చేస్తున్నాయి. మంగళవారం ఓ యువ వైద్యురాలు తన బామ్మను ఆటోలో కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె ఆక్సిజన్‌ స్థాయి పడిపోతుండటంతో ట్రయేజ్‌ విభాగం ఆవరణలోనే ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన సిలిండర్‌తో ఆమెకు ప్రాణవాయువు అందించారు. ఎమర్జెన్సీ వార్డులో చేర్చుకున్నారు. కొడుకు, కోడలు అందరూ ఉన్నా, ఎవరికీ బరువు కావొద్దనుకొని ఆ బామ్మ ఆశ్రమంలో ఉంటున్నారట. కొంతకాలంగా భోజనం సరిగా చేయకపోవడం, కొవిడ్‌ తోడవ్వడంతో ఆశ్రమం వారి సమాచారంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

* అంబులెన్సులు అందుబాటులో లేక పోవడంతో ఓ వయోధికురాలిని కుటుంబ సభ్యులు సెవెన్‌ సీటర్‌ ఆటోలో ఓ కుర్చీవేసి కింగ్‌కోఠి ఆసుపత్రికి వచ్చారు. అప్పటికే ఆమె అచేతనావస్థలో ఉన్నారు. వైద్య సిబ్బంది వచ్చి పల్స్‌, ఆక్సిజన్‌ స్థాయి అన్నీ పరీక్షించారు. తర్వాత ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కుటుంబ సభ్యులను ప్రశ్నించగా ఇప్పటికే ఆమె మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. దేవుడిపై భారం వేసి ఆసుపత్రికి తీసుకొచ్చామన్నారు. ఇలా ప్రతి రోజూ కింగ్‌కోఠి ఆసుపత్రికి వందల మంది కొవిడ్‌ బాధితులు, అనుమానితులు వస్తుంటారు. కొందరు జీవితాన్ని జయిస్తామనే ఆత్మస్థైర్యంలో వచ్చి పూర్తి ఆరోగ్యవంతులై వెళ్తున్నారు. కానీ, కొందరు దురదుష్టవశాత్తూ ఓడిపోతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని