Ts News: ఫీజుల వసూళ్లపై హైకోర్టులో విచారణ
logo
Published : 22/06/2021 14:34 IST

Ts News: ఫీజుల వసూళ్లపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు, ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్ స్కూల్స్‌ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేసింది. అధిక ఫీజులు వసూలు చేసిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటున్నామని పాఠశాల విద్యాశాఖ న్యాయస్థానానికి తెలిపింది. జీవో 46ను ఉల్లంఘించిన పాఠశాలలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నామని వెల్లడించింది. నాలుగు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని కోర్టుకు వివరించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రావని.. సంబంధిత బోర్డుల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ వివరణను హైకోర్టు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ ఎత్తివేసినందున ఆన్‌లైన్‌ పాఠాల నిర్వహణపై విచారణ అవసరం లేదని అభిప్రాయపడిన ధర్మాసనం విచారణను ముగించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని