క్యాన్సర్‌ భయాన్ని పోగొట్టిన మహా మనిషి ఎన్టీఆర్‌
logo
Published : 23/06/2021 02:15 IST

క్యాన్సర్‌ భయాన్ని పోగొట్టిన మహా మనిషి ఎన్టీఆర్‌

బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ
ఆస్పత్రి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేక్‌ కోస్తున్న బాలకృష్ణ

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: ప్రజల్లో క్యాన్సర్‌ భయాన్ని పోగొట్టిన మహా మనిషి నందమూరి తారక రామారావు అని, ఆయన ఆలోచనల నుంచి ఆవిర్భవించిన బసవ తారకం క్యాన్సర్‌ ఆస్పత్రి 21వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని బీఐఏసీహెచ్‌ అండ్‌ ఆర్‌ఐ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి, రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(బీఐఏసీహెచ్‌ అండ్‌ ఆర్‌ఐ) 21వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఆస్పత్రి ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. సీఈవో డా. ఆర్‌వీ ప్రభాకర్‌రావు స్వాగతోపన్యాసం చేస్తూ గతేడాది కాలంలో బసవతారకం ఆస్పత్రి సాధించిన అభివృద్ధిని వివరించారు. ముఖ్యంగా కొవిడ్‌ సమయంలో ఆస్పత్రి సిబ్బందికి కరోనా సోకకుండా తీసుకున్న చర్యలను తెలిపారు. మెడికల్‌ డైరెక్టర్‌ డా. టి.సుబ్రమణ్యేశ్వరరావు, ట్రస్టు బోర్డు సభ్యులు ఎం.భరత్‌, జేఎస్‌ఆర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ, భవిష్యత్తు అవసరాలు, మార్పులకు అనుగుణంగా వైద్య చికిత్సలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు. సినీ గాయకులు సాయిరాం, రితిక ఆనందిలు.. ఎన్టీఆర్‌ నటించిన నాటి సినీ గేయాలను ఆలపించి ఆకట్టుకున్నారు. సంస్థ సీవోవో రవి కుమార్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా.ఫణికోటేశ్వరరావు, అసోసియేట్‌ డైరెక్టర్‌ డా.కల్పన రఘునాథ్‌, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని