ఔదార్యం చూపిన మంత్రి కేటీఆర్‌
eenadu telugu news
Published : 27/07/2021 02:41 IST

ఔదార్యం చూపిన మంత్రి కేటీఆర్‌

క్షతగాత్రులను కారులో ఆస్పత్రికి తరలింపు

ఈటీవీ, సిద్దిపేట: మంత్రి కేటీఆర్‌ ఔదార్యం చాటుకున్నారు. సిద్దిపేట శివారు వైద్య కళాశాల సమీపంలో డివైడర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొని పట్టణ కాళ్లకుంట కాలనీకి చెందిన మామాఅల్లుళ్లు జబ్బార్‌, యూసుఫ్‌ కింద పడి గాయాల పాలయ్యారు. సిరిసిల్ల పర్యటన ముగించుకుని హైదరాబాదుకు తిరిగి వెళ్తున్న మంత్రి కేటీఆర్‌.. వీరిని గమనించి ఆగారు. తన వాహన శ్రేణిలోని కారులో క్షతగాత్రులను వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి పంపించారు. తన వ్యక్తిగత సహాయకుడు మహేందర్‌రెడ్డితో పాటు ఎస్కార్ట్‌ పోలీసులను సైతం పంపించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్‌లో మంత్రి సూచించారు. మంత్రికి క్షతగాత్రుల బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని