పరిగి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: ఎమ్మెల్యే
eenadu telugu news
Published : 01/08/2021 00:59 IST

పరిగి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: ఎమ్మెల్యే

పట్టణంలో విజయోత్సవ ర్యాలీ

పరిగి: డిగ్రీ కళాశాల మంజూరు కావడంతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చినట్లవుతోందని ఎమ్మెల్యే కె.మహేష్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం కళాశాలను మంజూరు చేయడంతో శనివారం అమరవీరుల కూడలిలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రెండున్నర దశాబ్దాల కలను ముఖ్యమంత్రి నెరవేర్చారని చెప్పారు. దశల వారీగా పరిగి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను తయారు చేస్తున్నామన్నారు. ఇప్పటికే చౌడాపూర్‌, మహమ్మదాబాద్‌ గ్రామాలను రెండు మండలాలుగా ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ అశోక్‌కుమార్‌, పరిగి, దోమ ఎంపీపీలు అరవింద్‌రావు, సత్యమ్మ, జడ్పీటీసీలు హరిప్రియ, కె.నాగిరెడ్డి, సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కె.శ్యాంసుందర్‌రెడ్డి, ఎస్‌.భాస్కర్‌, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొని ప్రసంగించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని