142పై వేటు.. 420కి పచ్చజెండా!
eenadu telugu news
Published : 22/09/2021 03:53 IST

142పై వేటు.. 420కి పచ్చజెండా!

మూగజీవుల విక్రయశాలలపై జీహెచ్‌ఎంసీ సర్వే

ఈనాడు, హైదరాబాద్‌: మూగజీవుల విక్రయ కేంద్రాలు, వాటిలో పరిస్థితులపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. పెరుగుతున్న జంతు హింస, అక్రమ పద్ధతుల్లో సంతానోత్పత్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న 142 కేంద్రాలపై అధికారులు వేటు వేశారు. నిబంధనలు సవ్యంగా పాటిస్తున్న 420 కేంద్రాలకు కొత్తగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. మరో 35 కేంద్రాలకు సంబంధించిన లైసెన్సు జారీ ప్రక్రియ పురోగతిలో ఉందని జీహెచ్‌ఎంసీ పశు వైద్య విభాగం స్పష్టం చేస్తోంది.

నిబంధనలు పాటించాల్సిందే..

గ్రేటర్‌లో పెంపుడు జంతువులకు విపరీతమైన మార్కెట్‌ ఉంది. పక్షులు, జంతువులతో పాటు తాబేళ్ల, ఉభయచర జీవులను విక్రయించే కేంద్రాలు నగరంలో చాలా ఉన్నాయి. టీకాలు, ఇతరత్రా అడ్డదారుల్లో జాతి కుక్కలను ఉత్పత్తి చేస్తున్న కేంద్రాలపై ఇటీవల జంతు ప్రేమికులు రాష్ట్ర సర్కారుకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ జీహెచ్‌ఎంసీ విభాగం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. వెటర్నరీ విభాగం రెండు నెలలుగా తనిఖీలు నిర్వహించింది. రాష్ట్ర జంతు సంరక్షణ బోర్డు, జీహెచ్‌ఎంసీ అనుమతి లేకుండా నడుస్తున్న కేంద్రాల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి పరిస్థితులను చక్కదిద్దుకోని దుకాణాలపై వేటు వేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని