చిత్ర వార్తలు
eenadu telugu news
Updated : 25/09/2021 05:44 IST

చిత్ర వార్తలు

పరిణతి.. మురిసితి

బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పగలల్లా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడతారు తల్లిదండ్రులు. సాయంత్రం ఇంటికెళ్లి పిల్లలను చూడగానే ఆ శ్రమంతా మరుస్తారు. అమ్మానాన్న ఎల్బీనగర్‌ వద్ద పైవంతెన పనుల్లో ఉండగా వారితోపాటే ఉన్న కుమారుడు తల్లికి సాయపడతానని కోరడంతో బిడ్డ పరిణతికి తల్లి మురిసిపోయి అక్కున చేర్చుకుందిలా..


ఇంటింటికీ నీరు.. వీరికే ఎందుకీ తీరు

 

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం కింద నగరంలో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు. అయినా కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇబ్బందులు తప్పడంలేదు. బోరబండ కల్యాణ్‌నగర్‌ వాసులు తాగునీటికి ఇప్పటికీ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది.

 


శాసన సభ సమావేశాలకు భారీ భద్రత
శాసన సభ సమావేశాల నేపథ్యంలో తొలిరోజు శుక్రవారం అసెంబ్లీ బయట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీఐపీల రాక సందర్భంగా ట్రాఫిక్‌ను నిలిపి వేయడంతో జనం ఇబ్బంది పడ్డారు.

కోమటిచెరువు సిగలో మరో మణిహారం

త్వరలోనే ఆక్వా స్క్రీన్‌ ఫ్లోటింగ్‌ మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌

సిద్దిపేట కోమటిచెరువు.. నిత్య నూతనంగా ప్రజలను ఆకర్షిస్తోంది. సరికొత్త శోభను సంతరించుకుంటోంది. అభివృద్ధి తీరు.. అబ్బురపరుస్తోంది. ఈ నీటి వనరులో త్వరలోనే ఆక్వా స్క్రీన్‌ ఫ్లోటింగ్‌ మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ ఆవిష్కృతం కానుంది. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో పర్యాటక శాఖ ఈ ప్రక్రియను చేపట్టింది. నూతన సాంకేతికతతో ఇది పర్యాటకులకు ఆనందాన్ని పంచనుంది. 300కు పైగా నాజిల్స్‌, రెండు ప్రొజెక్టర్లు, రెండు లేజర్లు వినియోగించనున్నారు. 60 మోటార్ల ఆధారంగా విద్యుత్తు వినియోగంతో నిర్వహిస్తారు. సంగీతానికి అనుగుణంగా నీళ్లు వివిధ రంగుల్లో కనువిందు చేయనున్నాయి. నీటితోనే ఒక తెర ఏర్పడి.. అందులో నిర్దేశిత చిత్రాలు, వీడియోలు ఆవిష్కృతం కానున్నాయి. దీనికి రూ.4.20 కోట్లు వెచ్చిస్తున్నారు. ఏడు రోజుల కిందట పనులు ప్రారంభించారు. బతుకమ్మ పండుగలోపు అందుబాటులోకి తీసుకురానున్నారు.

- న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని