జాతీయ సెమినార్‌కు ములుగు ప్రధానోపాధ్యాయురాలు
eenadu telugu news
Published : 23/10/2021 05:47 IST

జాతీయ సెమినార్‌కు ములుగు ప్రధానోపాధ్యాయురాలు

ములుగు, న్యూస్‌టుడే: జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సెమినార్‌కు రాష్ట్రం నుంచి ములుగు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు క్రాంతికుమారి ఎంపికయ్యారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో శనివారం అసోం రాష్ట్రంలోని గౌహతిలో సదరు కార్యక్రమం జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లో ప్రత్యేక విధానాలు పాటించి విద్యార్థులను తీర్చిదిద్దిన వైనంపై ‘రైస్‌ అండ్‌ షైన్‌’ పేరిట రూపొందించిన పుస్తకంలో వివరించారు. ఈ మేరకు ఆమె పని చేస్తున్న పాఠశాలలో అమలు చేసిన పద్ధతులను వివరించేందుకు ఆహ్వానించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని