TS News: అనుమానాస్పద స్థితిలో న్యాయవాది మృతి
eenadu telugu news
Updated : 25/10/2021 08:43 IST

TS News: అనుమానాస్పద స్థితిలో న్యాయవాది మృతి

బాపిరాజు

నల్లకుంట, న్యూస్‌టుడే: ఒంటరిగా జీవిస్తున్న ఓ న్యాయవాది అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నల్లకుంట సీఐ మొగిలిచర్ల రవి కథనం ప్రకారం.. న్యూనల్లకుంట సిద్ధార్థ అపార్ట్‌మెంట్‌లో బాపిరాజు(54) అనే న్యాయవాది 20 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఆదివారం ఉదయం అతని సోదరి చంద్రకళ ఫోన్‌ చేయగా సమాధానం ఇవ్వకపోవడంతో స్థానికులకు చెప్పారు. ఫ్లాట్‌కు వెళ్లి తలుపులు తొలగించి, చూడగా మంచంపై విగతజీవిగా పడి ఉన్నాడు. అతని సోదరుడు ఫణికుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని