ఉచిత న్యాయంపై అవగాహన కల్పించాలి
eenadu telugu news
Published : 27/10/2021 04:57 IST

ఉచిత న్యాయంపై అవగాహన కల్పించాలి


మాట్లాడుతున్న రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రేణుక

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: పేద ప్రజలకు ఉచిత న్యాయ సేవలను అందిస్తున్నాం. దీనిపై అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో అవగాహన కల్పించడానికి కృషి చేయాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి (మెంబర్‌ సెక్రటరీ) రేణుక తెలిపారు. మంగళవారం జిల్లా పాలనాధికారి కార్యాలయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులతో, ప్రజా ప్రతినిధులతో ఉచిత న్యాయ సహాయంపై దృశ్య మాధ్యమంలో ఆమె మాట్లాడారు. ఆజాద్‌ కీ అమృతోత్సవ్‌లో భాగంగా ఈనెల 2 నుంచి నవంబర్‌ 14 వరకు గ్రామాల్లో ఉచిత న్యాయం చట్టాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలందరికీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ఉచితంగా వైద్యం ఉంది. అలాగే జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో పేద ప్రజలకు ఎలాంటి రుసుం లేకుండా ఉచిత న్యాయ సహాయం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాలనాధికారిణి నిఖిల, అదనపు జిల్లా న్యాయమూర్తి పద్మ, జిల్లా పోలీసు అధికారి నారాయణ, జిల్లా అదనపు పాలానాధికారి చంద్రయ్య, ఏఎస్పీ రషీద్‌, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీర్‌డీవో కృష్ణన్‌, జిల్లా వైద్యాధికారి తుకారాంభట్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ వరప్రసాద్‌, జిల్లా సంక్షేమాధికారిణి లలితకుమారి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, సభ్యులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని