Published : 03/12/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అందరికీ ఆరోగ్యం

● జనాభాకు తగ్గట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు

● కొత్త కేంద్రాల ఏర్పాటుకు స్థలాల అన్వేషణ

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: పురపాలికల్లో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా పట్టణ ఆరోగ్య కేంద్రాలను కూడా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మెరుగైన ఆరోగ్య సేవలతో పాటు వసతులు, సౌకర్యాలను పెంచడంతోపాటు ప్రస్తుతం ఉన్న కేంద్రాలకు అదనంగా మరికొన్నింటిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని తొమ్మిది మున్సిపాల్టీల్లో కొత్తగా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.

*జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లో కొత్తగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పురపాలికల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలు ప్రజల అవసరాలకు దూరంగా ఉన్నాయి. ఎక్కడో విసిరేసినట్లుగా ఉన్న కేంద్రాలతో ప్రజలకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. దీంతో నూతన కేంద్రాల నిర్మాణంతోపాటు ఉన్న కేంద్రాలకు ఆధునిక సొగసులు అద్దనున్నారు. 22 వేల నుంచి 25 వేల జనాభాకు ఒక ఆరోగ్య కేంద్రం ఉండేలా అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఆమేరకు ప్రస్తుతం స్థలాల ఎంపిక చేసే బాధ్యతలను పురపాలక కమిషనర్లకు అప్పజెప్పారు. ఆ మేరకు ఒక్కో కేంద్రం నిర్మాణానికి సుమారు 10 సెంట్ల స్థలం అవసరమనే ప్రతిపాదనలు అన్ని పురపాలక సంఘాల్లో తయారుచేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ క్రమంలోనే ఒక్కొక్క కేంద్రానికి రూ.80 లక్షలు అవసరమని ప్రతిపాదించారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న ఆరోగ్య కేంద్రాల్లో రెండు ఓపీ గదులు, నిరీక్షణ గది, పరీక్షలు, మందులు, ప్రాథమిక చికిత్సకు ఒక్కొక్క గది నిర్మించనున్నారు. ఇదే సమయంలో సమావేశం గది, లేబర్‌ రూం వంటి సౌకర్యాలు కూడా నూతన కేంద్రాల్లో ఉండనున్నాయి. నూతన ఆరోగ్య కేంద్రాల నిర్మాణంతోపాటు పాత కేంద్రాలకు కూడా కొత్త సొబగులు అద్దనున్నారు.కేంద్రాల్లో వైద్య పరికరాలు ఇతర సామగ్రిని ఏపీ వైద్య సేవల, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ సమకూర్చనుంది. కొత్తగా నిర్మించనున్న 20 కేంద్రాలకు రూ.16 కోట్లు వెచ్చించనున్నారు.

*● జిల్లాలో ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీలు: 21

*● కొత్తగా ఏర్పాటు కానున్నవి: 20

*● నిర్మాణానికి అయ్యే నిధులు: రూ.16 కోట్లు

నంద్యాలలో పట్టణ ఆరోగ్య కేంద్రం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని