వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
eenadu telugu news
Updated : 27/09/2021 21:13 IST

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

సి.బెళగల్‌: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన భారత్‌ బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు సుభాన్‌, ఏఐటీయూసీ నాయకుడు రాజు ఎర్రజెండాలు చేతబూని గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ.. దుకాణాలను మూసివేయించారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలను కూడా మూయించారు. అనంతరం సి.బెళగల్‌ బస్టాండ్‌లో రాస్తారోకో నిర్వహించి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయొద్దంటూ నినాదాలు చేశారు. బంద్‌ కారణంగా ట్రాఫిక్‌ స్తంభించింది. బంద్‌కు హమాలీ సంఘం, తెదేపా మద్దతుదారులు, ఇతర నాయకులు సంఘీభావం తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని