సార్వత్రిక విద్య చక్కటి అవకాశం
eenadu telugu news
Published : 22/09/2021 02:16 IST

సార్వత్రిక విద్య చక్కటి అవకాశం

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న వెంకటస్వామి, తదితరులు

శివ్వంపేట, న్యూస్‌టుడే: చదువు మధ్యలో ఆపేసిన వారికి సార్వత్రిక విద్య చక్కటి అవకాశమని సార్వత్రిక విద్యా ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి అన్నారు. మంగళవారం శివ్వంపేటలోని పాఠశాలలో ప్రవేశాలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశం పొందేందుకు అపరాధ రుసుం లేకుండా ఈ నెలాఖరు వరకు అవకాశం ఉందన్నారు. ప్రధానోపాధ్యాయురాలు నారాయణమ్మ, రమేశ్‌, మంజుల, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని