రాయితీ బియ్యం పట్టివేత
logo
Published : 22/10/2020 02:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాయితీ బియ్యం పట్టివేత

పెన్‌పహాడ్‌: రాయితీ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని గాజులమొల్కాపురంలో పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఎస్సై రంజిత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రేషన్‌ డీలర్‌ బెల్లంకొండ లక్ష్మి పంపిణీ చేసిన రాయితీ బియ్యం 104 క్వింటాళ్లు తిరిగి లబ్ధిదారుల నుంచి కిలో రూ.4.50 చొప్పున నాలుగు నెలలుగా కొనుగోలు చేశారు. ఈ బియ్యాన్ని డీలర్‌ లక్ష్మి, గోవర్దన్‌ దంపతులు లారీలో తరలిస్తుండగా స్థానికుల సమాచారంతో ఎస్సై, సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పెద్దగారకుంట తండాకు చెందిన బర్మావత్‌ చాంప్లా డీలరు నుంచి పీడీఎస్‌ బియ్యాన్ని కిలో రూ.6 చొప్పున ఖరీదు చేస్తూ కోదాడ మండలం తమ్మరకు చెందిన పుట్టబంతి గోపికి కిలో రూ.6.25 చొప్పున విక్రయిస్తున్నారు. గతంలోనూ 60 క్వింటాళ్లు పీడీఎస్‌ బియ్యం డీలర్‌ అక్రమంగా తరలించారు. డీలర్‌ లక్ష్మి దంపతులు, చాంప్లా, గోపి, లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని ఎస్సై తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని