Yadadri ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టుకి నిధులివ్వండి
logo
Published : 11/06/2021 20:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Yadadri ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టుకి నిధులివ్వండి

సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌: యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు త్వరగా ప్రారంభం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద మంజూరు చేయాల్సిన రూ. 75 కోట్లు విడుద‌ల చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. భువ‌న‌గిరి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఎంఎంటీఎస్ ఫేజ్-2 (ఘట్‌కేసర్-రాయిగిరి) విస్తరణ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌ నుంచి యాద‌గిరిగుట్టకు ర‌వాణా సౌక‌ర్యం మరింత సులభతరం అవుతుందన్నారు. అలాగే భ‌క్తుల తాకిడి సైతం పెరుగుతుందని వివ‌రించారు. భ‌క్తుల‌ సౌక‌ర్యార్థం, యాదాద్రి అభివృద్ధి కావాలంటే ఈ ప్రాజెక్టు ఎంతో ముఖ్యమైందన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో చొర‌వ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం భ‌రించాల్సిన వ్యయాన్ని వెంట‌నే విడుద‌ల చేసి ప‌నులు ప్రారంభించేందుకు రైల్వే శాఖ‌కు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా రూ. 75 కోట్లను రైల్వే శాఖ‌కు డిపాజిట్ చేయాలని.. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు త‌గిన సూచ‌న‌లు చేయాల‌ని సీఎం కేసీఆర్‌ను కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని