హవ్వ..నీరు వదిలే వేళ పనులా!
eenadu telugu news
Published : 28/10/2021 02:14 IST

హవ్వ..నీరు వదిలే వేళ పనులా!

 


పనులు చేస్తున్న కూలీలు

నెల్లూరు(ఇరిగేషన్‌), న్యూస్‌టుడే: సాగుకు నీరు విడుదలయ్యే సమయంలో కార్పొరేషన్‌ ఇంజినీరింగ్‌ అధికారులు పంట కాలువ పనులు చేపట్టడం చర్చనీయాంశమైంది. గత వారం రోజులుగా జిల్లాలోని అన్ని కాలువలకు నీరు విడుదలవుతుండగా... కనుపర్తిపాడు కాలువలో సిమెంట్‌ వాల్స్‌ పనులను కార్పొరేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగం చేపట్టింది. నెల్లూరు మాగుంట లేఅవుట్‌ ప్రాంతంలో గత రెండు రోజులుగా ఇవి జరుగుతుండగా... ప్రజారోగ్యశాఖ అమృత్‌ పథకం కింద చేపట్టాల్సినవి.. ఇప్పుడు కార్పొరేషన్‌ అధికారులు ఎందుకు చేస్తున్నారనేది అటు నీటిపారుదలశాఖ, ఇటు ప్రజారోగ్యశాఖ అధికారులకు అంతుపట్టడం లేదు. పంటకు నీటి విడుదల నేపథ్యంలో నగరంలో కాలువల సిమెంట్‌ వాల్‌ పనులు నిలుపుదల చేశామని ప్రజారోగ్యశాఖ ఈఈ జానీ తెలపగా, అన్ని కాలువల్లో పనులు నిలుపుదల చేశామని నీటిపారుదలశాఖ ఎస్‌ఈ కృష్ణమోహన్‌ పేర్కొన్నారు. కార్పొరేషన్‌ డీఈ శేషగిరి రావు మాత్రం పంట కాలువల్లో ప్రజారోగ్యశాఖ అసంపూర్తి పనులు కొంత చేస్తున్నామని చెప్పారు. బుధవారం సాయంత్రం చీకటి పడినా పనులు జరుగుతుండటం, ఇంజినీర్ల పర్యవేక్షణ లేకుండా కేవలం తాపీ మేస్త్రీలే చక్కబెడుతుండటం విమర్శలకు తావిచ్చింది. పూడికలతో కాలువలు నిండి మురుగు ముందుకు పోవడం లేదని, తాగునీరు వృథాగా పోతోందని, సరఫరా జరగడం లేదని ప్రజలు గగ్గోలు పెట్టినా పెద్దగా స్పందించని కార్పొరేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగం.. నేడు ప్రజారోగ్యశాఖ అసంపూర్తి పనులు చేయడం గమనార్హం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని