రక్తదానం చేయండి.. ప్రాణాలు కాపాడండి
eenadu telugu news
Updated : 18/10/2021 17:39 IST

రక్తదానం చేయండి.. ప్రాణాలు కాపాడండి

బీర్కూర్‌: రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడాలని ఎస్సై రాజేశ్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఠాణాలో పోలీసు శాఖ, లయన్స్‌ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదానంపై యువకులకు అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఈనెల 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీర్కూర్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, కొత్త రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ మండల అధ్యక్షుడు సంతోష్‌, ట్రైనీ ఎస్సై హరీశ్‌, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు సంతోష్‌, హనుమన్లు, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని