Published : 07/07/2020 03:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిశ పోలీస్‌ స్టేషన్‌లోడీజీపీ పరిశీలన


సిబ్బందితో మాట్లాడుతున్న డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి దిశ పోలీస్‌స్టేషన్‌ని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సోమవారం ఉదయం పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సదుపాయాలను పరిశీలించారు. అనంతరం గత ప్రభుత్వ హయాంలో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించిన పట్టణ పోలీస్‌ స్టేషన్‌ నూతన భవనాన్ని పరిశీలించారు. ఈ భవనం ప్రారంభం కావాల్సి ఉంది. దీనిపై చర్చించినట్లు తెలిసింది. తరవాత విజయవాడకు బయలుదేరి వెళ్లారు. డీజీపీ వెంట విశాఖ రేంజ్‌ డీఐజీ రంగారావు, ఎస్పీ కృష్ణారావు, అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ కుమారస్వామి ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని