నిల్వ ఆహారం తిని మహిళ మృతి
logo
Published : 18/06/2021 03:51 IST

నిల్వ ఆహారం తిని మహిళ మృతి

పలువురికి అస్వస్థత

అంగన్‌వాడీ కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులు

అనంతగిరి, న్యూస్‌టుడే: నిల్వ ఉంచిన ఆహారం తిని ఓ మహిళ మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురైన ఘటన అనంతగిరి మండలంలో గురువారం చోటుచేసుకుంది. బొర్రా పంచాయతీ సర్పంచి అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. కటికి గ్రామంలో రెండు రోజుల కిందట విందు కార్యక్రమం జరిగింది. మిగిలిన ఆహారాన్ని స్థానికులు పంచుకుని బుధవారం రాత్రి వరకు తిన్నారు. వీరిలో పలువురు గురువారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో వైద్యాధికారిణి అనూష, వైద్య సిబ్బందికి సర్పంచి సమాచారం ఇచ్చారు. వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకుని అంగన్‌వాడీ కేంద్రంలో బాధితులకు వైద్యసేవలు అందించారు. నిల్వ ఉన్న ఆహారం తినడంతో అస్వస్థతకు గురైనట్లు నిర్ధారించారు. ఎనిమిది మందికి స్థానికంగానే వైద్య సేవలు అందించగా, ఇద్దరిని అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి పంపారు. అరకులోయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొర్రా రంభ (48) మృతి చెందారు. ఈమె దీర్గకాలిక వ్యాధితో బాధపడుతున్నారని, బాగా నీరసించి మృతి చెందినట్లు వైద్య సిబ్బంది పేర్కొన్నారు. మిగిలిన తొమ్మిది మంది ఆరోగ్య పరిస్థితి నిలడకగా ఉందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని