మహిళల రక్షణకు చిత్తశుద్ధితో పనిచేయాలి
eenadu telugu news
Published : 19/09/2021 03:24 IST

మహిళల రక్షణకు చిత్తశుద్ధితో పనిచేయాలి

పార్వతమ్మతో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి తదితరులు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ఐద్వా నాయకురాలిగా సుదీర్ఘకాలం మహిళా ఉద్యమాలను నడిపిన తిమ్మరాజుపేటకు చెందిన కర్రి పార్వతమ్మను సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి శనివారం తిమ్మరాజుపేట వచ్చి పరామర్శించారు. వయోభారంతో ఇబ్బందిపడుతున్న పార్వతమ్మ యోగక్షేమాలు అడిగారు. ఆమెతో కలిసి ఈ ప్రాంతంలో నిర్వహించిన ప్రజా, మహిళా ఉద్యమాలను పుణ్యవతి గుర్తుకు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై ఈ సందర్భంగా పార్వతమ్మ, ఇతర నాయకులతో చర్చించారు. పూడిమడకలో బాలికలపై అత్యాచార ఉదంతాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళా రక్షణకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆమె కోరారు. ఐద్వా అధ్యక్షురాలు ప్రభావతి, కౌలు రైతుల సంఘం నాయకులు కె.రామసదాశివరావు, సీపీఎం నాయకులు కన్నుంనాయుడు, కర్రి రామలక్ష్మి, సీతలక్ష్మి, కాంచన, కర్రి చినబాబు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని