ఆడేపాడే ప్రాయంలో అచేతనంగా..
eenadu telugu news
Updated : 19/09/2021 03:24 IST

ఆడేపాడే ప్రాయంలో అచేతనంగా..

హోంగార్డు కుటుంబంలో విషాదం

మంచంపై బాలుడు మూర్తి

చోడవరం, న్యూస్‌టుడే: పిల్లలందరితో పాఠశాలకు పరుగులు తీయాల్సిన తొమ్మిదేళ్ల కె.సన్మిత్‌ మూర్తి శాశ్వతంగా అవయవాలను కోల్పోయాడు. అచేతనుడిగా ఆసుపత్రి మంచంపై దీనంగా ఉన్నాడు. వినాయక చవితి రోజున విద్యుదాఘాతానికి గురైన మూర్తి రెండు కాళ్లు, కుడి చేతిని తీయాల్సి వచ్చింది. కుమారుడి దీనస్థితి నుంచి మెరుగైన పరిస్థితి పొందేలా సాయం చేయాలంటూ తండ్రి కోల్కులూరి శివరామరాజు కోరుతున్నారు. చోడవరం మండలం లక్కవరం గ్రామానికి చెందిన శివరామరాజు చోడవరం పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. స్థానిక కోఆపరేటివ్‌ కాలనీలో తన ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి ఉంటున్నారు. వినాయక చవితి రోజున ఇంటి మేడపైన మూర్తి తోటిపిల్లలతో కలిసి షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడుకుంటున్నాడు. ఈ ఇంటిపైనే ఉన్న విద్యుత్తు తీగలు మూర్తి చేతిలో ఉన్న బ్యాట్‌ తగలడంతో కాలు, చేయి బాగా కాలిపోయాయి. కడుపుపై కూడా గాయాలయ్యాయి. వెంటనే విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం ఆనంతరం మూర్తికి ఓ చేయి, రెండు కాళ్లు తొలగించాలని వైద్యులు తెలిపారు. దీంతో అక్కడి నుంచి మూర్తిని విశాఖలో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్యులు తీవ్రంగా కాలిన కుడి చేతితో పాటు రెండు కాళ్లలో పాదాల పైవరకు తొలగించారు. ప్రస్తుతం ఇక్కడే చికిత్స పొందుతున్నాడు. కళ్ల ముందే ఆడుతూ పరుగులు తీసే కొడుకు పరిస్థితిని చూసి హోంగార్డు కుటుంబం కుమిలిపోతోంది. తన తనయుడి దయనీయ స్థితిపై ఆయన చేసిన విజ్ఞప్తి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని